Tuesday, 11 October 2011

గాడిద చేసే పని గాడిదే చెయ్యాలి : ఎన్టీఆర్ In Press Meet

నేను బేసిగ్గా ఓ సిద్దాంతాన్ని నమ్ముతాను..గాడిద చేసే పని గాడిదే చెయ్యాలి.గుర్రం చేసే పని గుర్రమే చెయ్యాలి. నా పని నేను చేస్తున్నాను అన్నారు ఎన్టీఆర్. ఆయన్ని ఊసరవెల్లి ప్రమోషన్ లో భాగంగా కలిసిన మీడియా వారు మీకు దర్శకత్వం చెయ్యాలన్న ఆలోచన ఉందా అని అడిగితే ఆయన ఇలా స్పందించారు. అలాగే... మనకు చాలా మంది గొప్ప దర్శకులు ఉన్నారు. భవిష్యత్ లో నేను నిర్మాతను అవుతానేమో... నా సినిమాలను నేనే చెయ్యవచ్చు. లేకుంటే అందరూ కొత్త వారితో చెయ్యవచ్చు అని నిర్మహమాటంగా మనస్సులో మాట చెప్పేసారు. ఇక ఊసరవెల్లి గురించి చెపుతూ... హీరోయిన్ మీద రన్ అయ్యే సినిమా అనేసరికి అందరికీ రిస్క్ అనే భావన వస్తుంది. కానీ నేను తొలిసారి వినగానే కథ బాగా నచ్చింది.

అస్సలు హీరోయిన్ మీద నడవకపోతే కథలో కొత్తదనమేముంటుంది. లేడీస్ అందరూ ఈ కథకు అంత బాగా కనెక్టు అవుతున్నారంటే కారణం కథే.కాకపోతే టైటిల్ పరంగా కొంత ఆలోచించా అన్నారు. ఇక ఈ చిత్రం నా జీవితంలో ఇదో ప్రత్యేక చిత్రంగా మిగిలిపోతుంది. కథా పరంగా ఓ ప్రయోగం గా అనిపించింది. ఇంటర్వెల్ అయిన తర్వాత తమన్నా ప్లాష్ బ్యాక్ మొదలవుతుంది. దాదాపు ఇరవై నిముషాల సేపు హీరో కనపడడు. వాణిజ్య అంశాలు మేళవించిన చిత్రాల్లో ఇలాంటి ఎత్తుగడ ఓ ప్రయోగం.. ప్రమాదం అన్నారు. కానీ సురేంద్రరెడ్డి ఈ పాయింటు చెప్తున్నప్పుడు బాగా నచ్చి చేసాను అన్నారు.

0 comments:

Post a Comment

INDIA ENOW

How do u rate my blog?

Share

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More