పవన్ కల్యాణ్ హీరోగా తమిళ దర్శకుడు విష్ణువర్థన్ రూపొందిస్తున్న సినిమా 'పంజా' తెలుగులో విష్ణువర్థన్‌కి ఇదే తొలి సినిమా. అజిత్‌తో తీసిన 'బిల్లా' డైరెక్టర్‌గా అతను తమిళంలో ప్రసిద్ధుడు. 'పంజా'లో పవన్ సరసన నాయికలుగా సారాజేన్ డయాస్, అంజలా లావణియా తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. 'పులి' వంటి డిజాస్టర్ తర్వాత చాలా కసితో ఈ సినిమా చేస్తున్నాడు పవన్. 'పంజా'లో ఆయన గడ్డంతో కొత్త గెటప్పులో కనిపించబోతున్నాడు.
కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాని విష్ణువర్థన్ తీర్చిదిద్దుతున్నాడు. పవన్ 'ఖుషి' సినిమాలో మొదట కోల్‌కతా నేపథ్యం కనిపించిన సంగతి తెలిసిందే. అదివరకు చిరంజీవి 'చూడాలని ఉంది' సినిమా కూడా ఇదే బ్యాక్‌డ్రాప్‌లో కనిపించింది. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్టయ్యాయి. అదే సెంటిమెంట్ 'పంజా'కి వర్తిస్తుందని పవన్ అభిమానులు ఆశిస్తున్నారు. బాలీవుడ్ నటులు జాకీ ష్రాఫ్, అతుల్ కులకర్ణి కీలక పాత్రలు చేస్తున్న ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ గొప్పగా వచ్చాయని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి.
'క్రిష్', 'మై నేం ఈజ్ ఖాన్', 'త్రీ ఇడియట్స్' సినిమాలకి పనిచేసిన యాక్షన్ డైరెక్టర్ శ్యాం కౌశల్ ఈ సినిమాలోని యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరించడం విశేషం. యువన్ శంకర్‌రాజా సంగీతం మరో ఎట్రాక్షన్ కానున్న ఈ సినిమాని తెలుగుతో పాటు తమిళంలోనూ విడుదల చేయాలని నిర్మాతలు సంకల్పించారు. సంఘమిత్ర ఆర్ట్స్, ఆర్కా మీడియా వర్క్స్ బేనర్లపై నీలిమ తిరుమలశెట్టి, శోభు యార్లగడ్డ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. నవంబర్‌లో పాటల్నీ, డిసెంబర్‌లో సినిమానీ విడుదల చేయడానికి వాళ్లు ప్లాన్ చేస్తున్నారు.
బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, అలీ, అడివి శేష్, పరుచూరి వెంకటేశ్వరరావు, సుబ్బరాజు, ఝాన్సీ తారాగణమైన ఈ సినిమాకి స్క్రీన్‌ప్లే: రాషుల్ కోడా, మాటలు: అబ్బూరి రవి, పాటలు: చంద్రబోస్, రామజోగయ్యశాస్త్రి, సినిమాటోగ్రఫీ: పి.ఎస్. వినోద్, ఎడిటింగ్: ఎ. శ్రీకరప్రసాద్, స్టయిలింగ్: అనూ వర్థన్, కథ, దర్శకత్వం: విష్ణువర్థన్.
0 comments:
Post a Comment