Monday 10 October 2011

sankranti bettle between Pawan,NTR and Mahesh

దూకుడు సినిమా విజయం ఇచ్చిన స్పూర్తితో మహేష్ బాబు 'బిజినెస్ మేన్' చిత్రం షూటింగులో ఉత్సాహంగా పాల్గొంటున్నాడు. ఈ చిత్రం కోసం ఈ నెల 4, 5, 6 తేదీల్లో ముంబైలో మహేష్ బాబు, కాజల్ పై దర్శకుడు పూరీ జగన్నాథ్ ఓ థీం సాంగ్ ను షూట్ చేశాడు. ఇందు కోసం ముంబైలో ప్రత్యేకమైన సెట్స్ కూడా వేశారు. 'దూకుడు' సినిమాలో 'గురువారం..' పాటను పాడిన రాహుల్ నంబియార్ ఈ పాట పాడాడు.

కాగా, ప్రస్తుతం టాకీ పార్ట్ కు సంబంధించిన సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. అలాగే ఈ నెలలో మరో పాటను కూడా చిత్రీకరిస్తారని తెలుస్తోంది. మరోపక్క ముంబైలోనే మ్యూజిక్ సిటింగ్స్ కూడా జరుగుతున్నాయి. ఈ చిత్రంలో మహేష్ క్యారెక్టర్ గురించి వెంకట్ మాట్లాడుతూ ఇందులో మహేష్ హై ఓల్టేజ్ యాక్షన్ మూవీ అయితే పూర్తి వినోదభరితంగా మంచి కథతో నిర్మించబడుతోంది. తప్పకుండా మహేష్ ఫ్యాన్స్ ని, ప్రేక్షకులను సంతృప్తి పరుస్తుందన్నారు.


జూ ఎన్టీఆర్ ఊసరవెల్లి నుంచి బయటికొచ్చి ఇప్పుడు ‘దమ్ము’ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. శనివారం హైదరాబాద్ లో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. ఆల్రెడీ రెండు షెడ్యూల్స్ కంప్లీట్ అయ్యిన ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ లోనే స్టార్ట్ అవ్వాల్సింది. ‘ఊసరవెల్లి’ షూటింగ్ లో ఎన్టీఆర్ కి గాయం కావడం వల్ల కొంత డిలే అయింది. ఇంతకు ముందు రెండు షెడ్యుళ్ల షూటింగు జరిగిన సంగతి తెలిసిందే. ఆ షూటింగులో యన్టీఆర్, శృతి హాసన్ లపై రొమాంటిక్ సన్నివేశాలు; యన్టీఆర్, రాహుల్ దేవ్, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, అలీలపై యాక్షన్, కామెడీ సన్నివేశాలను చిత్రీకరించారు. 'ఊసరవెల్లి' సినిమా రిలీజైపోవడంతో యన్టీఆర్ ఇక పూర్తిగా ఈ సినిమాపైనే దృష్టి పెట్టాడు.

సంక్రాంతి సినిమావాళ్ళకు పెద్ద పండగగా మారిన సంగతి తెలిసిందే. వచ్చే సంక్రాంతి(2012) విడుదలల కోసం ఇప్పుటినుంచే షెడ్యూల్స్ ప్లాన్స్ జరుగుతున్నాయి. సంక్రాంతి పోటీలో ఈ సారి ముగ్గరు మధ్యే పోటీ ఉండబోతోందంటున్నారు. ఆ ముగ్గరూ పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్. ఆ సినిమాలు ఏమిటంటే..పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్, ఎన్టీఆర్, బోయపాటి చిత్రం,మహేష్ ది బిజినెస్ మ్యాన్.!

0 comments:

Post a Comment

INDIA ENOW

How do u rate my blog?

Share

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More